ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూర్యనే ఖరారు చేసుకున్నాడు!

Mon, Jun 27, 2016
సూర్య
సూర్య
ఇప్పుడు కోలీవుడ్ లో ఎక్కడ చూసినా దర్శకుడు రంజిత్ పేరే వినిపిస్తోంది .. కనిపిస్తోంది. అంతగా రిలీజ్ కి ముందే 'కబాలి' చిత్రం ఆయనకి క్రేజ్ ను తీసుకొచ్చింది. రజనీకాంత్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా, వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆయన హైదరాబాద్ వచ్చాడు.

రజనీతో ఈ సినిమా చేయడం తన అదృష్టమని ఆయన అన్నాడు. 'కబాలి' తరువాత కూడా తాను చేసే సినిమా తెలుగు .. తమిళ భాషల్లో ఉంటుందని చెప్పాడు. కథానాయకుడుగా ఈ సినిమాకి సూర్యను ఖరారు చేసుకున్నట్టుగా చెప్పాడు. రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సూర్య గట్టి ప్రయత్నం చేస్తున్నాడంటూ ఇటీవల ఒక వార్త షికారు చేసింది. మొత్తానికి సూర్య అనుకున్నది సాధించాడన్నమాట. ప్రస్తుతం '24' హిట్ తో ఉత్సాహంగా వున్న సూర్య, ' సింగం 3' ను పూర్తి చేసే పనిలో వున్నాడు. ఆ సినిమా పూర్తికాగానే, రంజిత్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)