ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నితిన్ రెండు సినిమాల ప్లానింగ్

Mon, Jun 27, 2016
నితిన్
నితిన్
ఇటీవల విడుదలైన 'అ ఆ' చిత్రం సక్సెస్ కావడంతో హీరో నితిన్ మాంచి జోష్ మీదున్నాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఇది నిలవడంతో హీరోగా అతని రేంజ్ కూడా బాగా పెరిగింది. పలువురు నిర్మాతలు ఆయనతో చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ యువ హీరో తాజాగా రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వీటిలో ఒకటి తన హోమ్ బ్యానర్ అయిన శ్రేశ్ట్ మూవీస్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటుంది. అలాగే, ఆమధ్య 'బెంగాల్ టైగర్' చిత్రాన్ని నిర్మించిన కేకే రాధామోహన్ బ్యానర్లో ఒక చిత్రం చేయడానికి నితిన్ ఓకే చెప్పాడట. వీటిలో ముందుగా హోమ్ బ్యానర్లో నిర్మించే చిత్రం మొదలవుతుంది. అయితే, ఈ చిత్రాలకు దర్శకులు ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)