ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Mon, Jun 27, 2016
అనుపమ పరమేశ్వరన్
అనుపమ పరమేశ్వరన్
* ఇటీవల విడుదలైన 'ఆ ఆ' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా శర్వానంద్ సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే 'శతమానం భవతి' చిత్రంలో శర్వానంద్, అనుపమ జంటగా నటిస్తారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కి వెళుతుంది.
* శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రేయా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన 'నిర్మలా కాన్వెంట్' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జి.నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో దీనిని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
* కన్నడ భామ ప్రణీత తాజాగా టెక్కీ పాత్రను పోషిస్తోంది. కొద్దీ కాలం గ్యాప్ తర్వాత ఈ చిన్నది ప్రస్తుతం తమిళంలో జై కథానాయకుడుగా రూపొందే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఈ చిన్నది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను పోషిస్తోంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)