ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరోగారి ఇంట శుభకార్యం!

Sun, Jun 26, 2016
విక్రం తనయ అక్షిత
విక్రం తనయ అక్షిత
తెలుగు ప్రేక్షకులకు కూడా చిరపరిచితుడైన తమిళ కథానాయకుడు విక్రం ఇంట్లో త్వరలో ఓ శుభకార్యం జరగనుంది. ఆయన కూతురు అక్షిత వివాహ నిశ్చితార్థంకు ముహూర్తం నిర్ణయమైనట్టు కోలీవుడ్ లో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. 'సీకే బేకరీ' అధినేత తనయుడు మను రంజిత్ తో ఆమె వివాహం జరగనున్నట్టు సమాచారం. వచ్చే నెల 10న చెన్నయ్ లోని ఓ స్టార్ హోటల్ లో ఈ నిశ్చితార్థ వేడుక సన్నిహితుల సమక్షంలో జరుగుతుందని, వివాహం వచ్చే ఏడాది ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ వార్త తెలియగానే, విక్రంకి ఇంత పెళ్లీడు పిల్ల ఉందా? అని అంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)