ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఒక మనసు'పై తమిళ హీరో దృష్టి

Sun, Jun 26, 2016
తమిళ కథానాయకుడు ధనుష్ తెలుగు సినిమా 'ఒక మనసు'పై మనసు పడ్డాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కథానాయికగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. 'మంచి సినిమా' అంటూ ఈ చిత్రానికి ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తమిళ హీరో ధనుష్ ప్రత్యేకంగా షో వేయించుకుని చూశాడట. చిత్ర కథ, కథనం, హీరో నాగశౌర్య పాత్ర ఆయనకు బాగా నచ్చాయట. దాంతో దీనిని తమిళంలో రీమేక్ చేయడానికి ఆయన నిర్ణయించుకున్నట్టు తాజా సమాచారం. తను హీరోగా నటిస్తూ, తన సొంత బ్యానర్లో దీనిని రీమేక్ చేయాలని ఆయన భావిస్తున్నాడట. ఈ విషయంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)