ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ తో అలాంటి కథే చేస్తాడట!

Sat, Jun 25, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
'అ ఆ' సినిమా సక్సెస్ తో త్రివిక్రమ్ వున్నాడు. డాలీ తో సెట్స్ పైకి వెళ్లడానికి పవన్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో పవన్ తో కలిసి త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్నిరోజుల క్రితమే బయటికి వచ్చింది. అప్పటి నుంచి ఆ సినిమా కథ ఎలా ఉండనుంది? అనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చల పై చర్చలు జరుగుతున్నాయి.

త్రివిక్రమ్ ఏ కథనైనా అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే సిద్ధం చేసుకుంటాడు. అయితే ఆ కథలో వేటి పాళ్లు ఎక్కువగా ఉంటాయి? అనేది ఆసక్తిని కలిగిస్తూ వుంటుంది. మరి ఈ సారి ఆయన కామెడీకి అధిక ప్రాధాన్యతను ఇస్తాడా .. లేక యాక్షన్ కా .. ఫ్యామిలీ డ్రామాకా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంచుమించు 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఆ కథ ఉంటుందనేది తాజా సమాచారం. అందుకు సంబంధించిన లైన్ ను ఆయన ఆల్రెడీ డెవలప్ చేస్తున్నాడని వినికిడి.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)