ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజమౌళి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడట!

Sat, Jun 25, 2016
రాజమౌళి
రాజమౌళి
మోహన్ లాల్ .. గౌతమి ప్రధాన పాత్రలుగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో 'మనమంతా' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫస్టు టీజర్ ను ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. ఈ టీజర్ రాజమౌళికి బాగా నచ్చిందట. చంద్రశేఖర్ యేలేటి .. మోహన్ లాల్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతూ వస్తోందనీ, ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని తాను ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

రాజమౌళి ఒక సినిమాను గురించి ఆసక్తికరంగా మాట్లాడారు అంటే, సహజంగానే అందరి దృష్టి ఆ వైపుకి తిరిగిపోతుంది. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకోనుంది. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాను, వచ్చే నెలలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)