ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నితిన్ రేటు పెంచేశాడా?

Sat, Jun 25, 2016
నితిన్
నితిన్
హీరోలైనా .. హీరోయిన్లైనా ఒక భారీ హిట్ పడిన తరువాత తమ పారితోషికం పెంచడమనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అలా ఇటీవల కాలంలో తమ పారితోషికం పెంచిన హీరోల జాబితాలో నితిన్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ నటించిన 'అ ఆ' చిత్రం భారీ వసూళ్లను సాధించింది.

నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచింది. నటన పరంగా కూడా నితిన్ కి మంచి మార్కులు దక్కాయి. అంతేకాదు గతంలో కంటే ఎక్కువగా అతని క్రేజ్ పెరిగింది. అందువలన నితిన్ తన పారితోషికాన్ని పెంచేశాడని అంటున్నారు. తనని సంప్రదిస్తోన్న దర్శక నిర్మాతలకి ఆయన ఈ కొత్త రేటు చెబుతున్నాడట. ప్రస్తుతానికి నితిన్ ఇద్దరు దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ముందుగా ఆయన ఎవరితో సెట్స్ పైకి వెళతాడో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)