ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'మనమంతా' టీజర్ రిలీజ్

Sat, Jun 25, 2016
మోహన్ లాల్
మోహన్ లాల్
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి 'మనమంతా' చిత్రాన్ని తెరకెక్కించాడు. మోహన్ లాల్ .. గౌతమి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఫస్టులుక్ తోనే ఆసక్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. పాత్రల పేర్లను పరిచయం చేస్తూ వదిలిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది.

మధ్యతరగతి జీవితాలు .. ఆశలు .. అవసరాలను ప్రతిబింబిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చి వాళ్లకి ఆనందాన్ని కలిగించిన మోహన్ లాల్, '' బ్రతకడం నేర్చుకున్నానని అనుకున్నానుగానీ .. మనిషిగా బ్రతకడం మరిచిపోయాను'' అని అనుకోవడం బాగుంది. మోహన్ లాల్ .. గౌతమి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక దర్శకుడిగా చంద్రశేఖర్ యేలేటి కూడా విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించి వున్నాడు కనుక, ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)