ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మహేశ్ ను కలవనున్న వంశీ పైడిపల్లి

Sat, Jun 25, 2016
మహేశ్ బాబు
మహేశ్ బాబు
మహేశ్ బాబును దర్శకుడు వంశీ పైడిపల్లి కలవనున్నాడా? అనే ప్రశ్నకి అవుననే సమాధానం వినిపిస్తోంది. మహేశ్ బాబు కోసం వంశీ పైడిపల్లి ఒక మంచి కథను రెడీ చేశాడట. మహేశ్ ఆ కథను వినడానికి సమయాన్ని ఇవ్వడంతో, వంశీ పైడిపల్లి ఆయనని కలవడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో మహేశ్ కి ఆయన కథ వినిపించవచ్చని చెబుతున్నారు.

'ఊపిరి' సినిమా ఘనవిజయం తరువాత, వంశీ పైడిపల్లి తదుపరి చిత్రం మహేశ్ తో ఉండవచ్చనే టాక్ వచ్చింది. అయితే మధ్యలో ఆయన అఖిల్ సినిమా చేసే అవకాశం ఉందని అనుకున్నారు. కొన్ని కారణాల వలన ఆ కాంబినేషన్ కుదరలేదు. దాంతో మహేశ్ తో సినిమా చేయడానికి వంశీ పైడిపల్లి సిద్ధపడ్డాడు. కచ్చితంగా ఆయన వైవిద్యభరితమైన కథను రెడీ చేసి ఉంటాడనీ, అది మహేశ్ కి తప్పకుండా నచ్చుతుందనే ఆశాభావాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే మురుగదాస్ మూవీ తరువాత వంశీ పైడిపల్లితోనే మహేశ్ సెట్స్ పైకి వెళతాడేమో.
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)