ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విమానాలను సైతం వదలని 'కబాలి'

Sat, Jun 25, 2016
'కబాలి'లో రజనీకాంత్
'కబాలి'లో రజనీకాంత్
రజనీకాంత్ కథానాయకుడిగా రంజిత్ తెరకెక్కించిన 'కబాలి' చిత్రం అంచనాలను పెంచేస్తూ వెళుతోంది. టీజర్ విషయంలోను .. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోను ఈ సినిమా కొత్త రికార్డులను నెలకొల్పింది. తాజాగా పబ్లిసిటీ పరంగా కూడా తనదైన ప్రత్యేకతను చాటుతోంది. ఈ సినిమా ప్రభంజనాన్ని సృష్టించాలని యూనిట్ భావిస్తోంది. అందువలన భారీస్థాయిలో పబ్లిసిటీ చేస్తున్నారు.

తమిళనాట బస్సులకు .. రైళ్లకు ఈ సినిమా పోస్టర్స్ ను ఒక రేంజ్ లో అంటిస్తున్నారు. ఇక ఈ ప్రచారంలో భాగంగా విమానాలను కూడా వదల్లేదు. రెండు డొమెస్టిక్ .. రెండు ఇంటర్ నేషనల్ విమానాలకు కూడా ఈ సినిమా పోస్టర్స్ ను వేసే పనిలో ఉన్నారు. ఇంతవరకూ ఓ హాలీవుడ్ మూవీ కోసం మాత్రమే ఈ తరహా పబ్లిసిటీ జరిగిందనీ, ఇండియాలో ఇలా విమానాలకి పోస్టర్స్ వేసి కొత్త ప్రచారానికి తెరతీసిన తొలి చిత్రంగా 'కబాలి' ఘనతను సొంతం చేసుకుందని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)