ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

లారెన్స్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది!

Sat, Jun 25, 2016
రితిక
రితిక
ఉత్తరాది భామ అయిన రితిక సింగ్ .. లారెన్స్ జోడీగా ఛాన్స్ కొట్టేసింది. రియల్ బాక్సర్ అయిన ఆమె .. ఈ మధ్య బాక్సర్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. దాంతో ఆమెను వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకి లారెన్స్ సరసన అవకాశం దక్కింది. కన్నడలో శివరాజ్ కుమార్ నటించిన 'శివగంగ' ఘనవిజయాన్ని అందుకుంది. దాంతో ఈ సినిమాను అదే పేరుతో తమిళంలో తెరకెక్కించడానికి పి.వాసు సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమాలో కథానాయకుడిగా లారెన్స్ ను ఎంపిక చేసుకున్న ఆయన, నాయికగా 'రితిక'ను తీసుకున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. లారెన్స్ తో సమానంగా డాన్స్ విషయంలో మెప్పించడం కోసం, రితిక శిక్షణ తీసుకునే పనిలో పడిందట. వచ్చేనెల 14న బెంగుళూరులో ఈ సినిమా షూటింగును ఆరంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)