ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దర్శకుడిగా మారుతున్న మరో రచయిత!

Sat, Jun 25, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
ఇటీవలి కాలంలో రచయితలు దర్శకులుగా మారుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ వంటి రచయితలు దర్శకులుగా బాగా సక్సెస్ కావడంతో వీరి నుంచి మరికొంతమంది రచయితలు స్ఫూర్తి పొందుతున్నారు. అలాగే విషయం వున్న రచయితలను హీరోలు కూడా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో 'బాడీగార్డ్', 'పండగ చేస్కో' వంటి పలు చిత్రాలకు రచయితగా వ్యవహరించిన వెలిగొండ శ్రీనివాస్ కూడా మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందే చిత్రం ద్వారా ఈయన దర్శకుడిగా పరిచయం కానున్నాడు. దీనిని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.204.198.71
Movie News (Latest)