ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'సైతాన్' వేషం వేస్తున్న బిచ్చగాడు!

Sat, Jun 25, 2016
విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ
బిచ్చగాడు... ఇటీవలి కాలంలో తెలుగునాట విజయ దుందుభి మోగించిన చిత్రం ఇది. తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోనీ నటించిన ఈ తమిళ అనువాద చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోనీ నటిస్తున్న తాజా చిత్రం 'సైతాన్' అనువాద హక్కుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ పోటీలో విన్.విన్.విన్.క్రియేషన్స్ సంస్థ అధినేత ఎన్.వేణుగోపాల్ (ప్రస్తుతం కృష్ణవంశీతో ఈయన 'నక్షత్రం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు) భారీ ఆఫర్ తో ఈ హక్కులను చేజిక్కించుకున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ, "సైతాన్ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. జూలైలో ఆడియోను, ఆగష్టులో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం" అన్నారు. హీరో విజయ్ ఆంటోనీ చెబుతూ, వైవిధ్యమైన పాత్రలు పోషించాలన్న తన కోరికకు ఇది కొనసాగింపుగా ఉంటుందని, ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పారు. అరుంధతీ నాయర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వతహాగా సంగీత దర్శకుడు కూడా అయిన విజయ్ ఆంటోనీ దీనికి కూడా సంగీతాన్ని తానే అందిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)