ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రాజ్ తరుణ్ మూవీ ఆగిపోలేదట!

Fri, Jun 24, 2016
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ కి డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేసిన అనుభవం ఉంది. అందువలన కథ .. స్క్రీన్ ప్లేపై పట్టు కూడా ఉంది. అలాంటి రాజ్ తరుణ్ హీరోగా మారడం .. వరుస హిట్లు కొట్టడం జరిగిపోతున్నాయి. అయితే డైరెక్షన్ విషయంలో తనకి గల అనుభవం కారణంగా మిగతా విషయాల్లో కల్పించుకుంటున్నాడనీ, ఫలితంగా కొన్ని అవకాశాలు కోల్పోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

అలా ఆయన చేస్తోన్న ఎ.కె.ఎంటర్టైన్ మెంట్స్ వారి సినిమా కూడా ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై నిర్మాతలు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని చెప్పారు. వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని, రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతోందని అన్నారు. ఈ సినిమా తరువాత రాజ్ తరుణ్ తోనే మరో రెండు సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నామని స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)