ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సినిమా నిర్మాణం గురించి మురళీమోహన్!

Fri, Jun 24, 2016
మురళీమోహన్
మురళీమోహన్
నిండైన వ్యక్తిత్వానికి నిదర్శనంగా మురళీమోహన్ కనిపిస్తుంటారు. నిలువెత్తు ఆత్మవిశ్వాసానికి నిర్వచనంలా అనిపిస్తుంటారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడంతో, ఆ సంతోషాన్ని ఆయన మీడియా మిత్రులతో పంచుకున్నారు. గతంలో మాదిరిగా 'జయభేరి' బ్యానర్ పై సినిమాలు తీయకపోవడం గురించి వాళ్ల నుంచి ఆయనకి ప్రశ్నఎదురైంది.

ఒకప్పుడు దర్శక నిర్మాతల అభిరుచిని బట్టి సినిమాలు వచ్చాయనీ, ఇప్పుడు కాంబినేషన్ ప్రధానమైన పాత్రను పోషిస్తోందని ఆయన అన్నారు. కథానాయకులు రెమ్యునరేషన్ పెంచుకుంటూ వెళుతున్నారనీ, ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదని చెప్పారు. ఒకప్పుడు ఎన్టీఆర్ .. అక్కినేని ఇద్దరూ కూడా రెమ్యునరేషన్ విషయంలో కలిసి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు సినిమా నిర్మాణం కష్టతరంగా మారిందనీ, భవిష్యత్తులో తమ బ్యానర్ పై సినిమాలు వచ్చే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.204.108.121
Movie News (Latest)