ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'నేను హీరో'ని అంటున్న అమలాపాల్!

Fri, Jun 24, 2016
అమలాపాల్
అమలాపాల్
'ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో నేను హీరోయిన్ కాదు... హీరోని' అంటోంది డస్కీ బ్యూటీ అమలాపాల్. ఆమె చెబుతున్నది ఈ రోజు తమిళనాట రిలీజైన 'అమ్మ కనక్కు' చిత్రం గురించి. ఇందులో ఆమె ప్రదర్శించిన అభినయానికి ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి.

దీనిపై అమలా పాల్ మాట్లాడుతూ, "ఇందులో నేను శాంతి అనే పనమ్మాయి పాత్ర పోషించాను. పదమూడేళ్ల పిల్లకి తల్లిగా నటించాను. వయసు చిన్నదే అయినా శాంతిలో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖంలో ఆ భావాలు నిండుగా పలికించాలి. అందుకోసం చాలా కష్టపడ్డాను. ప్రతి సన్నివేశంలోనూ డిఫరెంట్ ఎక్స్ ప్రేషన్స్ ఇవ్వాలి. ఇది నాకు చాలా చాలెంజ్ అయింది. ఈ సినిమా కథ ఎక్కువగా నా మీదే ఆధారపడింది. దాంతో మేజర్ పార్ట్ నేనే మోయాల్సివచ్చింది. అందుకే, టెక్నికల్ గా చెప్పాలంటే ఈ సినిమాకి నేనే హీరోని" అంటూ నవ్వేసింది. హీరో ధనుష్, సంగీత దర్శకుడు ఇళయారాజా ఈ సినిమాలో ఆమె అభినయాన్ని చూసి ఆమెను అభినందించకుండా వుండలేకపోయారట!
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)