ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హరీశ్ శంకర్ తో బన్నీ?

Fri, Jun 24, 2016
అల్లు అర్జున్
అల్లు అర్జున్
అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విక్రమ్ కుమార్ తో గానీ లింగుస్వామితో గాని కలిసి ఒక సినిమా చేయనున్నాడనే వార్తలు షికారు చేశాయి. దాంతో ఈ ఇద్దరిలో ఆయన ఎవరితో కలిసి సెట్స్ పైకి వెళతాడా అనే సందేహం తలెత్తింది. అయితే లింగుస్వామితోనే బన్నీ సెట్స్ పైకి వెళదామని అనుకున్నాడట గానీ, చివరి నిమిషంలో తేడా కొట్టిందట. దాంతో బన్నీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

అదే సమయంలో బన్నీకి హరీశ్ శంకర్ కథ వినిపించడం .. అది ఆయనకి బాగా నచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ లైన్ ని డెవలప్ చేయమని బన్నీ చెప్పడంతో, ప్రస్తుతం హరీశ్ శంకర్ ఆ పనిలో వున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి దిల్ రాజు ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకి మరింత క్రేజ్ పెరిగిపోయింది. గతంలో దిల్ రాజు .. హరీశ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' ఘనవిజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)