ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'తిక్క' క్లైమాక్స్ మరచిపోలేరట!

Fri, Jun 24, 2016
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను .. మాస్ ఆడియన్స్ తో విజిల్స్ వేయించే కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ ప్రయత్నంలో ఆయన హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతో ఆయన సునీల్ రెడ్డి దర్శకత్వంలో 'తిక్క' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది.

ఈ సందర్భంగా దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాలో చివరి 25 నిమిషాల క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు. వర్మ దర్శకత్వంలో గతంలో వచ్చిన 'అనగనగా ఒక రోజు' .. 'మనీ' సినిమాల క్లైమాక్స్ లను ఆడియన్స్ చాలాకాలం పాటు గుర్తుపెట్టుకున్నారనీ, అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ను కూడా చాలాకాలం పాటు మరిచిపోలేరని అన్నాడు. అంతటి ఆసక్తికరంగా ఈ సినిమా క్లైమాక్స్ ఉంటుందని చెప్పాడు. రోహిణ్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో, సాయిధరమ్ తేజ్ జోడీగా లారిస్సా బొనేసి నటిస్తోన్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)