ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని మరిన్ని ప్రయోగాలు చేస్తాడట!

Fri, Jun 24, 2016
'జెంటిల్ మన్'లో నాని
'జెంటిల్ మన్'లో నాని
'జెంటిల్ మన్' సినిమాతో నాని మరో హిట్ కొట్టేశాడు. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ తరహా పాత్రను ఆయన ఎంపిక చేసుకోవడాన్ని అభినందిస్తున్నారు. ఈ కథను తనకి ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పినప్పుడే తాను ఒక ప్రయోగం చేయబోతున్నానని అనిపించిందని నాని అన్నాడు.

అయితే ఈ ప్రయోగానికి తప్పకుండా ఆదరణ లభిస్తుందనే నమ్మకం కూడా కలిగిందని చెప్పాడు. తాను అనుకున్నట్టుగానే ఈ పాత్రను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారని అన్నాడు. ఫలానా తరహా పాత్రలు మాత్రమే నాని చేయగలడంటూ, ఇప్పటివరకూ వున్న ముద్రను ఈ సినిమా తుడిచేసిందని చెప్పాడు. ఇక ముందు కూడా ఈ తరహా ప్రయోగాలు చేయాలనుకుంటున్నాననీ, అందుకు అభిమానుల ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.205.54.215
Movie News (Latest)