ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నిహారిక మంచి మార్కులు కొట్టేసింది!

Fri, Jun 24, 2016
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
నిహారిక కథానాయికగా నటించిన 'ఒక మనసు' సినిమా కోసం ఆమె అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అలాంటి ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా గ్లామర్ విషయంలోను .. నటన విషయంలోను నిహారిక మంచి మార్కులు కొట్టేసింది. అందం .. అమాయకత్వంతో కూడిన ఆమె లుక్స్ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి.

పక్కింటి అమ్మాయిగా .. పరిచయమున్న అమ్మాయిగా సన్నివేశాల్లో ఒదిగిపోవడమే కాకుండా, పాటల్లోను చక్కని ఫీల్ ను ప్రదర్శించగలిగింది. ఈ కథకి తగిన నాయికగా ఆమెను గురించి ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. బుల్లితెరపై యాంకర్ గా శభాష్ అనిపించుకున్న నిహారిక, ఆ తరువాత వెబ్ సిరీస్ ద్వారా నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇక కథానాయికగా వెండితెరపై ఎలా కనిపిస్తుందో చూడాలనుకున్నవాళ్లు ఆమెకి ఫుల్ మార్క్స్ ఇచ్చేశారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)