ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అంధుడి పాత్రలో రామ్?

Fri, Jun 24, 2016
రామ్
రామ్
నిన్నమొన్నటి వరకూ తనదైన దూకుడు చూపిస్తూ వచ్చిన రామ్, విభిన్నమైన కథలను ఎంచుకునే నిమిత్తం కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సంతోష్ శ్రీనివాస్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది. ఈ సినిమా తరువాత ఆయన అనిల్ రావిపూడితో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఇది అంధుడి పాత్ర అంటూ ఫిల్మ్ నగర్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే సినిమా మొత్తం కాకుండా కొంతసేపు అలా కనిపించవచ్చనీ, ఈ తరహా పాత్రను పోషించడానికి సిద్ధపడటమంటే సాహసమేనని అనుకుంటున్నారు. మాస్ ఆడియన్స్ ను సైతం అలరించే ప్రేమకథా చిత్రంగా ఇది ఉంటుందని చెబుతున్నారు. 'పటాస్' తో కల్యాణ్ రామ్ కి .. 'సుప్రీమ్'తో సాయిధరమ్ తేజ్ కి హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ఈ సినిమాతో రామ్ కి కూడా సక్సెస్ ను ఇచ్చి తాను హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో!
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)