ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తమన్నా అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది?

Fri, Jun 24, 2016
తమన్నా
తమన్నా
అందరిలాగానే మిల్కీ బ్యూటీ తమన్నా టార్గెట్ కూడా బాలీవుడ్డే! అక్కడ టాప్ రేంజికి వెళ్లి సక్సెస్ కావడమే ఆమె కల. అయితే, టాలీవుడ్, కోలీవుడ్ లలో సక్సెస్ అయిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో మాత్రం ఇంతవరకు విజయాన్ని సాధించలేకపోయింది. ఇదే అడిగితే, 'సక్సెస్ లు, ఫెయిల్యూర్లు మన చేతుల్లో లేవు కదా?' అంటూ వేదాంతం పలికింది.

"నా సినిమాల్లో పెద్ద విజయాలు సాధించినవీ వున్నాయి. పెద్ద ఫ్లాపులూ వున్నాయి. రెండింటినీ సమంగానే స్వీకరించాను. ఏ సినిమా విషయంలోనైనా ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక దానికి కట్టుబడాలి. ఏ సినిమా అయినా హిట్టవుతుందనే భావించి చేస్తాం. ఒక్కోసారి అది రివర్స్ అవ్వచ్చు. బాలీవుడ్ లో కూడా అదే జరిగింది. అదంతా మన ఫేట్" అని చెప్పింది. ఈ సందర్భంగా రాజమౌళికి తమన్నా థాంక్స్ చెప్పింది. తనను పరాజయాలు చుట్టుముట్టినప్పుడు రాజమౌళి ఫోన్ చేసి, 'బాహుబలి' ఆఫర్ ఇచ్చారని, అది మళ్లీ తన కెరీర్ కి ఊతాన్నిచ్చిందని ఈ చిన్నది చెప్పింది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)