ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంపూ చిత్రానికి ఓవర్సీస్ క్రేజ్!

Fri, Jun 24, 2016
సంపూర్నేష్ బాబు
సంపూర్నేష్ బాబు
తనకు తాను 'బర్నింగ్ స్టార్'గా నామకరణం చేసుకున్న సంపూర్నేష్ బాబు తొలి చిత్రం 'హృదయ కాలేయం' నుంచే టాలీవుడ్ లో సంచలనం రేపాడు. కామెడీతో కూడిన తన సరికొత్త అభినయం, ఆహార్యంతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో బాక్సాఫీసు వద్ద ఆయన చిత్రాలకు మంచి గిరాకీ ఏర్పడింది. ఈ కోవలో సంపూ నటిస్తున్న తాజా చిత్రం 'కొబ్బరిమట్ట' మరింత సెన్సేషన్ రేపుతోంది.
ఇందులో ఆయన మూడు పాత్రల్లో నటిస్తుండడంతో బిజినెస్ పరంగా మరింత క్రేజ్ వచ్చింది. దానికి తోడు, ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రాన్ని విదేశాల్లో రిలీజ్ చేయడానికి పలువురు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో 30 లక్షల రూపాయలకు ఈ ఓవర్సీస్ హక్కులను మిడ్ వెస్ట్ మూవీస్ పంపిణీ సంస్థ సొంతం చేసుకుంది. సంపూకి యూత్ లో వున్న క్రేజ్ వల్ల విదేశాల్లో కూడా దీనిని బాగా చూస్తారన్న ఉద్దేశంతో ఆ సంస్థ వుంది.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)