ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

దిల్ రాజును మెప్పించిన శ్రీకాంత్ అడ్డాల!

Thu, Jun 23, 2016
శ్రీకాంత్ అడ్డాల
శ్రీకాంత్ అడ్డాల
కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాలకి ఎంతో పేరుంది. అయితే ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం ఆశించినస్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఆయన తదుపరి కథలకి ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? అనే విషయంలో అంతా ఆసక్తితో వున్నారు. అనుకున్నట్టుగానే ఆయన వినిపించిన కథల పట్ల కొంతమంది కథానాయకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదట.

దాంతో తాను సిద్ధం చేసుకున్న కొన్ని కథలను ఆయన దిల్ రాజుకి వినిపించాడట. ఒకటి రెండు కథలు ఆయనకి బాగా నచ్చడంతో, పూర్తిస్థాయిలో వాటిని డెవలప్ చేయమని అన్నాడట. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల ఆ కథలపై కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. ఇక దిల్ రాజు .. శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ అంటే, సహజంగానే హీరోలు ఆసక్తిని చూపిస్తారు. ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో శ్రీకాంత్ అడ్డాల వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)