ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జక్కన్న' ఆడియో రిలీజ్ కి చిరూ!

Thu, Jun 23, 2016
చిరంజీవి
చిరంజీవి
దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల 'జక్కన్న' సినిమాను తనదైన శైలిలో తీర్చిదిద్దాడు. సునీల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, విడుదలకి ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ను ఈ నెల 24న ప్లాన్ చేశారు. హైదరాబాద్ - శిల్పకళా వేదికలో జరగనున్న ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు సమాచారం.

వినాయక్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతాడని చెబుతున్నారు. ఎందుకూ పనికిరాడని అంతా అనుకునే ఓ యువకుడు, జీవితంలో ఎలా ఎదిగాడు? ఏం సాధించాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ పాత్రలో సునీల్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో, సునీల్ ఈ సినిమా సక్సెస్ పై ఆశలు పెట్టుకున్నాడు. ఆయన ఆశ ఫలిస్తుందేమో చూడాలి.
X

Feedback Form

Your IP address: 50.16.52.237
Movie News (Latest)