ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

50 రోజులు పూర్తిచేసుకున్న 'సుప్రీమ్'

Thu, Jun 23, 2016
'సుప్రీమ్'లో రాశి ఖన్నా- సాయిధరమ్ తేజ్
'సుప్రీమ్'లో రాశి ఖన్నా- సాయిధరమ్ తేజ్
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సుప్రీమ్' సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. మే 5వ తేదీన విడుదలైన ఈ సినిమా ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. తెలుగు రాష్ట్రాలలోని 25 సెంటర్స్ లో ఈ సినిమా 50 రోజుల మైలురాయిని చేరుకుంది. సాయిధరమ్ తేజ్ కెరియర్ లోనే ఈ సినిమా భారీ వసూళ్లతో కూడిన విజయాన్ని అందుకుని, 50 రోజులు పండుగ చేసింది.

సాయిధరమ్ తేజ్ మొదటి నుంచి కూడా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి ప్రాధాన్యతనిస్తూ వచ్చాడు. దాంతో ఆయనకి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఫలితంగా 'సుప్రీమ్'పై అంచనాలు ఏర్పడటం .. వాటిని దర్శకుడు అనిల్ రావిపూడి అందుకోవడం జరిగింది. గతంలో ఆయన 'పటాస్' హిట్ ఇచ్చి ఉండటం కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. మొత్తానికి ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ మూడో హిట్ ను సొంతం చేసుకోగా, అనిల్ రావిపూడి రెండో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.161.209.240
Movie News (Latest)