ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అమెరికాలో సందడి చేయనున్న 'ఒక మనసు'

Wed, Jun 22, 2016
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
'ఒక మనసు'లో నాగశౌర్య - నిహారిక
నిహారిక కథానాయికగా నటించిన తొలి చిత్రం 'ఒక మనసు' ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోని అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

అమెరికాలో ఈ సినిమాను 75 స్క్రీన్లపై విడుదల చేయనున్నారు. ముందురోజున భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు కూడా వేయనున్నారు. ఆల్రెడీ ఆన్ లైన్ బుకింగ్ ను ఓపెన్ చేశారు. నిహారిక మెగా ఫ్యామిలీ నుంచి వస్తోన్న తొలి హీరోయిన్ కావడం వలన, బుల్లితెరపై సంపాదించిన క్రేజ్ తో హీరోయిన్ గా వస్తుండటం వలన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. నాగశౌర్య జోడీగా ఆమె నటించిన ప్రేమకథా చిత్రం కావడంతో యూత్ లోను క్రేజ్ ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)