ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

16 కోట్ల 'బిచ్చగాడు'

Wed, Jun 22, 2016
ఈ మధ్య కాలంలో తెలుగులో చిన్న సినిమాలు భారీ విజయాలను సాధిస్తూనే వున్నాయి. అయితే అనువాదంగా వచ్చిన ఒక చిన్న సినిమా భారీ విజయాన్ని సాధించడం మాత్రం విశేషంగానే చెప్పుకోవాలి. అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన చిత్రంగా 'బిచ్చగాడు' కనిపిస్తుంది. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ఈ సినిమాను 'పిచ్చయ్ కారన్' పేరుతో తమిళంలో తెరకెక్కించారు. హీరోగానే కాకుండా ఈ సినిమాకి ఒక నిర్మాతగా .. సంగీత దర్శకుడిగాను కూడా ఆయన వ్యవహరించాడు.

శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, తెలుగులో మే 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక్కడి సినిమాలకు పోటీగా నిలిచి ఇంతవరకూ 16 కోట్ల రూపాయలను వసూలు చేసింది. జూలై 1నాటికి ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకుంటుందనీ, 20 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని చెబుతున్నారు. దర్శకుడు శశి సిద్ధం చేసుకున్న కథ .. కథనాలు, ఆయన ఆవిష్కరించిన హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఈ స్థాయి వసూళ్లకు కారణమని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)