ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నటుడిగా బిజీ అయిన దర్శకుడు

Wed, Jun 22, 2016
ఎస్.జె. సూర్య.
ఎస్.జె. సూర్య.
చిత్రపరిశ్రమలో నటులు .. దర్శక నిర్మాతలుగా మారుతూ ఉండటం, దర్శకులు .. రచయితలు .. నటులుగా మారుతుండటం చాలాకాలంగా జరుగుతూ వస్తున్నదే. అలా నటుడిగా మారిన దర్శకుడే ఎస్.జె.సూర్య. తమిళ .. తెలుగు భాషల్లో దర్శకుడిగా సూర్య మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తరువాత ఆయన ఆట విడుపుగా నటించడం మొదలు పెట్టాడు.

అయితే ఆయన నటన చూసి ఇటు ఇండస్ట్రీలోని వాళ్లు .. అటు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. నటుడిగా తాను ఊహించిన దానికంటే ఎక్కువగా ఆయనకి క్రేజ్ వచ్చేసింది. కోలీవుడ్ నుంచే కాకుండా తెలుగు .. మలయాళ భాషల నుంచి కూడా ఆయనని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయట. దాంతో ఆయన నటనకే మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. పవన్ కల్యాణ్ సినిమాను ఆయన వదులుకోవడానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)