ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తన నటన ధనుష్ కి నచ్చలేదన్న నయన్!

Wed, Jun 22, 2016
నయనతార
నయనతార
ఏ విషయమైనా సరే దాపరికాలు ఉండవనీ .. నేరుగా మాట్లాడేస్తానని నయనతార కొన్ని సందర్భాల్లో చెప్పింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేదికపై ఆమె మాట్లాడిన తీరు చూస్తే, ఆమె చెప్పింది నిజమేనని అనిపిస్తుంది. ధనుష్ నిర్మించిన 'కాక్కా ముట్టై' ఉత్తమ చిత్రంగా ఎంపికకాగా ఇక 'నానుమ్ రౌడీ దాన్' చిత్రానికిగాను ఉత్తమ కథానాయికగా నయనతారకి అవార్డు వచ్చింది.

అయితే 'కాక్కాముట్టై' చిత్రానికి వచ్చిన అవార్డును అందుకుని, ఆ సినిమాను గురించి మాత్రమే ధనుష్ మాట్లాడి స్టేజ్ దిగిపోయాడు. ఆ తరువాత 'నానుమ్ రౌడీ దాన్' సినిమాకి గాను అవార్డు అందుకున్న నయనతార, ''ధనుష్ కి నా నటన నచ్చలేదనుకుంటాను .. అందుకే నా గురించి ఏమీ మాట్లాడలేదు'' అనేసింది. ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడానికి నయనతార .. దర్శకుడు విఘ్నేష్ శివన్ కారణం కనుకనే, ధనుష్ అలా వ్యవహరించాడనే గుసగుసలు అప్పుడు అక్కడ వినిపించాయి.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)