ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాని మూవీ శర్వానంద్ చేయాల్సిందట!

Tue, Jun 21, 2016
శర్వానంద్
శర్వానంద్
చిత్రపరిశ్రమలో ఒక కథ ముందుగా ఒకరి దగ్గరికి వెళ్లడం .. ఏదో కారణంగా కుదరక అది మరొకరి దగ్గరికి వెళ్లడమనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. అలా ఒకరు కాదన్న సినిమా మరొకరికి హిట్ తెచ్చిపెట్టడమనేది చాలాసార్లు జరుగుతూ వచ్చింది. అలాగే శర్వానంద్ విషయంలోనూ జరిగింది.

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ 'జెంటిల్ మన్' కథను ముందుగా శర్వానంద్ కి వినిపించారట. ఎందుకంటే శర్వానంద్ సీరియస్ పాత్రలను ఎక్కువగా ఇష్టపడతాడని ఆయన భావించాడు. అయితే కాస్త కామెడీ టచ్ వున్న పాత్రలు చేయాలని నిర్ణయించుకున్న శర్వానంద్, 'జెంటిల్ మన్' లో హీరో పాత్రకి నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయంటూ పెద్దగా ఆసక్తి చూపలేదట. దాంతో ఈ కథ నాని దగ్గరికి వెళ్లడం .. ఆయన ఓకే చెప్పడం .. అనూహ్యమైన విజయాన్ని సాధించడం జరిగిపోయాయి. అలా శర్వానంద్ మిస్సయిన హిట్ నేరుగా వెళ్లి నాని ఖాతాలో చేరింది.
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)