ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

గ్రామీణ నేపథ్యంలోనే చరణ్ మూవీ!

Tue, Jun 21, 2016
చరణ్
చరణ్
చరణ్ తాజా చిత్రంగా 'ధ్రువ' తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని వ్యక్తం చేస్తోన్న అభిమానులు, సుకుమార్ తో ఆయన చేయనున్న సినిమాపై కూడా దృష్టి పెట్టారు. చరణ్ తో సుకుమార్ చేయనున్న సినిమా 'జేమ్స్ బాండ్' తరహాలో కొనసాగుతుందని వార్తలు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదట. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందనేది తాజా సమాచారం. పూర్తిస్థాయిలో కాదు గానీ .. చాలావరకూ పల్లెటూరి నేపథ్యంలోనే ఈ కథ కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కథను పూర్తి స్థాయిలో రెడీ చేసే పనిలో సుకుమార్ వున్నాడని అంటున్నారు. 'నాన్నకు ప్రేమతో'లో విదేశీ లొకేషన్లతో ఆడియాన్స్ ను ఆశ్చర్యచకితులను చేసిన సుకుమార్, చరణ్ సినిమాలో పల్లెటూరి అందాలతో అలరిస్తాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)