ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఖమ్మంలో 'జనతా గ్యారేజ్' ఆడియో రిలీజ్?

Tue, Jun 21, 2016
ఎన్టీఆర్
ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంటోంది. దాంతో ఈ సినిమా టీమ్ ఆడియో రిలీజ్ గురించిన ఆలోచన చేస్తోంది. సహజంగానే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ని హైదరాబాద్ లో జరపవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుకను ఖమ్మంలో జరిపే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

రీసెంట్ గా 'జనతా గ్యారేజ్' షూటింగులో వున్న ఎన్టీఆర్ ను ఖమ్మం నుంచి వచ్చిన అభిమానులు కలుసుకున్నారట. వాళ్లతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన తెచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, ఎన్టీఆర్ జోడీగా సమంతా .. నిత్యామీనన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)