ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చిరూ కోసం భారీగా స్పెషల్ సెట్!

Tue, Jun 21, 2016
చిరంజీవి
చిరంజీవి
చిరంజీవి కథానాయకుడిగా నటించే 150వ సినిమాకి రంగం సిద్ధమవుతోంది. చరణ్ నిర్మాణంలో వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. వాస్తవానికి ఈ చిత్రం షూటింగ్ నిన్న (జూన్ 20) ప్రారంభం కావాల్సివుంది. అయితే, అనివార్య కారణాల వల్ల ఈ నెల 23 నుంచి దీనిని నిర్వహించనున్నట్టు తాజా సమాచారం.

చిరంజీవి పైనే ఫస్టు షాట్ తీయనున్నారని తెలుస్తోంది. మొదటి రెండు రోజులు హైదరాబాద్ - హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై చిత్రీకరణ జరగనున్నట్టు చెబుతున్నారు. ఆ తరువాత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఆ సన్నివేశాల చిత్రీకరణ కోసం భారీ స్థాయిలో ప్రత్యేకంగా ఒక సెట్ వేశారు. ఈ సినిమాలో కథానాయికగా ఎవరిని తీసుకోనున్నారోననే విషయంలో చిరూ అభిమానులంతా ఆసక్తిగా వున్నారు. చిరూ సరసన అరుదైన ఈ ఛాన్స్ ను కొట్టేసే నాయిక ఎవరో చూడాలి మరి.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)