ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కృష్ణా జిల్లాలో 'జెంటిల్ మన్' దూకుడు

Tue, Jun 21, 2016
'జెంటిల్ మన్'లో నివేదా థామస్ - నాని
'జెంటిల్ మన్'లో నివేదా థామస్ - నాని
నాని కథానాయకుడిగా రూపొందిన 'జెంటిల్ మన్' చిత్రం, విడుదలైన ప్రతిచోటా విజయవిహారం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఇక కృష్ణా జిల్లాలో 'జెంటిల్ మన్' మరీ దూకుడు చూపిస్తున్నాడు. ఈ ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 80 లక్షలకు అమ్ముడు కాగా .. ఈ సినిమా విడుదలైన 4వ రోజుకే 55 లక్షల షేర్ ను వసూలు చేసిందని చెబుతున్నారు.

ఈ సినిమా ఈ రేంజ్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుండటం వలన, ఇక్కడ ఈ గురువారం నుంచి రాబట్టే వసూళ్లన్నీ లాభాల కిందికే వస్తాయనేది ట్రేడ్ వర్గాల మాట. ఇంద్రగంటి మోహనకృష్ణ కథ .. కథనాలను పట్టుగా నడిపించిన తీరు .. నాని నటనలోని కొత్తదనం .. సురభి - నివేదా థామస్ ల గ్లామర్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను సాధించి పెడుతున్నాయని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.120.181
Movie News (Latest)