ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'ఒకే ఒక్కడు'కి సీక్వెల్!

Tue, Jun 21, 2016
అర్జున్
అర్జున్
శంకర్ దర్శకత్వం వహించిన సినిమాల్లో 'మొదలవన్' ఒకటి. అర్జున్ .. మనీషా కోయిరాలా జంటగా తెరకెక్కిన ఈ సినిమా, 'ఒకే ఒక్కడు' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను, అనిల్ కపూర్ .. రాణి ముఖర్జీ జంటగా హిందీలో 'నాయక్' పేరుతో శంకర్ రీమేక్ చేశాడు. అయితే, అక్కడ అది నిరాశ పరచింది.

ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేసే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి, దీపక్ ముకుత్ ఈ సీక్వెల్ ను రూపొందించాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సినిమాకి కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండటం విశేషం. ఈ సీక్వెల్ కి దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)