ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

షరతులు పెడుతోన్న కథానాయిక!

Tue, Jun 21, 2016
మడోనా సెబాస్టియన్
మడోనా సెబాస్టియన్
వెండితెరపై కథానాయికలుగా రాణించాలంటే గ్లామర్ తో పాటు అభినయం కూడా కావలసిందే. కెరియర్ ఆరంభంలో గ్లామర్ పాత్రల్లో మురిపించి, ఆ తరువాత నటనతో మెప్పిస్తోన్న కథానాయికలు కొందరు. మొదట్లో గ్లామర్ ఒలకబోయమనే నిబంధన పెట్టుకుని .. ఆ తరువాత ఆ నియమాన్ని పక్కన పెట్టేసిన కథానాయికలు మరికొందరు.

ఈ నేపథ్యంలో కండిషన్స్ పెడుతోన్న కథానాయికల జాబితాలో 'మడోనా సెబాస్టియన్' పేరు కూడా వినిపిస్తోంది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో ఇప్పుడిప్పుడే ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలాంటి ఆమె కురచదుస్తులు ధరించననీ .. కౌగిలింతల్లో పరిమితులు ఉన్నాయంటూ షరతులు పెడుతోందట. లక్ష్మీమీనన్ కూడా మొదట్లో ఇలాగే చెప్పి, ఆ తరువాత ఆ విషయాన్నే మరిచిపోయిందని కొంతమంది గుర్తు చేసుకుంటున్నారు. మడోనా సెబాస్టియన్ షరతులను అంగీకరించి ఆమెను తీసుకునేవాళ్లు ఎవరుంటారు? అని చెప్పుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.147.69
Movie News (Latest)