ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఊహించలేదంటోన్న నాని!

Tue, Jun 21, 2016
నాని
నాని
హీరోను అవుతానని గానీ .. ఈ స్థాయికి చేరుకుంటాననిగాని తాను ఎప్పుడూ అనుకోలేదని నాని చెప్పాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ను ఆరంభించిన తాను, ఆ తరువాత తెరపై కనిపిస్తే చాలనుకున్నాను కానీ, ఏకంగా హీరో అయిపోయానని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ తనతో సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే, ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని అన్నాడు.

తనతో సినిమా చేస్తే ఎవరు చూస్తారు? అనే ఆలోచన రావడమే కాదు, ఆ సమయంలో ఆ దర్శకుడిని చూసి జాలేసిందట. అయినా కథపై .. తనపై నమ్మకంతో ఆయన 'అష్టా చెమ్మ' చేసి, తనపై తనకి నమ్మకాన్ని కలిగించాడని చెప్పాడు. 'జెంటిల్ మన్'తో ఆ నమ్మకాన్ని మరింత పెంచాడని అన్నాడు. అర్హత .. అవకాశం .. అదృష్టం కారణంగా హీరో కావడం .. కొన్ని సక్సెస్ లతో స్టార్ కావడం సాధారణంగా జరిగేవేననీ, తనని అంతా తమ వాడిగా భావిస్తుండటమే తనకి అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)