ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Tue, Jun 21, 2016
ప్రియా ఆనంద్
ప్రియా ఆనంద్
* 'లీడర్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రియా ఆనంద్ గత కొన్నాళ్లుగా తమిళ సినిమాలు మాత్రమే చేస్తోంది. ఈ క్రమంలో తొలిసారిగా ఆమె ఓ మలయాళ సినిమాలో నటిస్తోంది. ఇందులో పృధ్వీరాజ్ సరసన ఆమె కథానాయికగా నటిస్తోంది. మరో విశేషం ఏమిటంటే, ఇదే ఏడాది ఈ చిన్నది తొలిసారిగా ఓ కన్నడ సినిమాలో కూడా నటించనుంది.
* రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి' తెలుగు వెర్షన్ ఆడియో వేడుకను ఈనెల 26న నిర్వహిస్తున్నారు. ఈ విషయన్ని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. గ్రాండుగా నిర్వహించే ఈ వేడుకకు సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు విచ్చేస్తారని నిర్మాతలు తెలిపారు. చిత్రాన్ని తమిళ వెర్షన్ తో పాటుగా జూలైలో విడుదల చేస్తామని చెప్పారు.
* వర ముళ్ళపూడి దర్శకత్వంలో రూపొందిన 'కుందనపు బొమ్మ' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ శుక్రవారం (జూన్ 24) విడుదలవుతోంది. దీనికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. గ్రామీణ వాతావరణంలో రూపొందిన ఈ ప్రేమకథ అందరికీ నచ్చుతుందని దర్శకుడు వర తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)