ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

స్క్రిప్టు పని మొదలెట్టిన డాలీ!

Mon, Jun 20, 2016
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రానికి ఎస్.జె. సూర్య స్థానంలో దర్శకుడిగా తాజాగా 'గోపాల గోపాల' ఫేం డాలీ (కిషోర్ కుమార్ పార్ధసాని) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పనులు మొత్తం మళ్లీ మొదటి నుంచీ జరుగుతున్నాయి. ముఖ్యంగా, స్క్రిప్టు వర్క్ పకడ్బందీగా చేయడానికి దర్శకుడు డాలీ ఇప్పుడు రంగంలోకి దిగారు. రచయిత ఆకుల శివతో కలసి ఆయన ఇప్పటికే స్క్రిప్టు పని మొదలుపెట్టినట్టు సమాచారం. పవన్ సూచనలు, సలహాలతో దీనిపై ఒక నెల రోజుల పాటు పనిచేసిన తర్వాత సెట్స్ కి వెళతారని తెలుస్తోంది. అంటే ఇక జూలై నెలాఖరులోనే దీని షూటింగ్ మొదలవుతుందని చెప్పచ్చు. రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రకథ సాగుతుందని అంటున్నారు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)