ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఈ నెల 24న 'జక్కన్న' ఆడియో రిలీజ్

Mon, Jun 20, 2016
బండరాళ్లలో సౌదర్యం ఉట్టిపడేలా శిల్పాలను మలచిన మహాశిల్పి జక్కన్న మాదిరిగానే, కథానాయకుడు సునీల్ కూడా ఈ సినిమాలో కొన్ని అద్భుతాలు చేస్తాడట. అందువలన అదే టైటిల్ తో 'జక్కన్న' తెరకెక్కింది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సుదర్శన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ భారీస్థాయిలో వ్యూవర్స్ ను ఆకట్టుకుంది. దాంతో సినిమా ఆడియో రిలీజ్ కి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత సుదర్శన రెడ్డి మాట్లాడుతూ, సినీప్రముఖులు .. అభిమానుల సమక్షంలో ఈ నెల 24న ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరపనున్నట్టు చెప్పారు. సునీల్ పంచ్ డైలాగ్స్ .. మన్నారా చోప్రా గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. కథ .. కథనం .. పాటలు ఆడియన్స్ కి బాగా నచ్చుతాయనే నమ్మకం వుందని చెప్పారు. వచ్చేనెలలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)