ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'విశ్వరూపం 2'కి విముక్తి కలగనుందట!

Mon, Jun 20, 2016
కమలహాసన్
కమలహాసన్
కమల్ తన ప్రతి సినిమా కొత్తగా వుండాలని కోరుకుంటారు .. కొత్తగా కనిపించాలని ఆరాటపడతారు. అందుకే ఆయన సినిమాల్లో వివిధ రకాల గెటప్పులతో కూడిన పాత్రలు .. ఆ పాత్రల్లో ఆయన చేసిన విన్యాసాలు కనిపిస్తాయి. అలాంటి కమల్ కొంతకాలం క్రితం 'విశ్వరూపం' అనే సినిమా చేశారు. నటన పరంగా ఈ సినిమా నిజంగానే ఆయన విశ్వరూపాన్ని చూపింది.

ఈ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'విశ్వరూపం 2'ను తెరకెక్కించాడు. కొన్ని కారణాల వలన విడుదల కాకుండా ఆగిపోయిన ఈ సినిమా, ప్రస్తుతం ఆస్కార్ రవిచంద్రన్ దగ్గర వుంది. ఈ సినిమా కోసం కమల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూనే వున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తీసుకుని తన సొంత బ్యానర్ పై రిలీజ్ చేయాలని కమల్ భావిస్తున్నాడట. అలా ఈ దీపావళికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చనే వార్తలు షికారు చేస్తుండటంతో, కమల్ అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)