ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాశ్మీర్ లొకేషన్స్ లో 'ధ్రువ'

Mon, Jun 20, 2016
చరణ్
చరణ్
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న 'ధ్రువ' సినిమా షూటింగు దశలో వుంది. ఇటీవలే హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా టీమ్, తాజా షెడ్యూల్ కోసం కాశ్మీర్ చేరుకుంది. కాశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ లో నాయకా నాయికల మధ్య ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఆ తరువాత కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారట. పది రోజుల పాటు అక్కడ షూటింగ్ జరుపుకుని ఈ సినిమా టీమ్ తిరిగి రానుంది.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ గా చరణ్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో కాజల్ ఒక పాటలో మెరవనుందని చెబుతున్నారు. 'బ్రూస్ లీ' పరాజయంతో డీలాపడిన చరణ్, ఈ సినిమా తప్పకుండా తనకి సక్సెస్ ను ఇస్తుందని భావిస్తున్నాడు. అందుకు కారణం ఈ సినిమా ఒరిజినల్ తమిళంలో పెద్ద హిట్ కావడమే.
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)