ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

విజయ్, విక్రంలతో శంకర్ భారీ చిత్రం?

Mon, Jun 20, 2016
శంకర్
శంకర్
దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'రోబో 2.0' సినిమా పనిలో బిజీగా వున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా వైపు, సినిమా ప్రేమికులందరి దృష్టి వుంది. ఇటీవలే ఆయన ఈ సినిమా షూటింగ్ 50 శాతం వరకూ పూర్తయినట్టుగా చెప్పాడు. దాంతో ఆయన తదుపరి సినిమా ఏమిటి? ఏ హీరోతో ఉండబోతోంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఒక భారీ మల్టీస్టారర్ అనే టాక్ వినిపిస్తోంది. విక్రమ్ .. విజయ్ లతో కలిసి ఆయన ఒక సినిమాను తెరకెక్కించే ఉద్దేశంతో ఉన్నాడని అంటున్నారు. గతంలోనే ఆయన ఒక వేదికపై ఈ విషయాన్ని చెప్పాడు. అప్పట్లోనే వీళ్ల కాంబినేషన్లో సినిమా రానుందని అంతా అనుకున్నారు. కానీ అనివార్య కారణాలన వలన ఆలస్యమైంది. ఈసారి మాత్రం ఈ ఇద్దరితో శంకర్ సెట్స్ పైకి వెళ్లడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 184.73.122.162
Movie News (Latest)