ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

యుఎస్ లో 'జెంటిల్ మన్' వసూళ్లు

Mon, Jun 20, 2016
'జెంటిల్ మన్' లో నాని - సురభి
'జెంటిల్ మన్' లో నాని - సురభి
నాని సినిమాలకి యుఎస్ లో మంచి క్రేజ్ వుంది .. అందువలన ఆయన సినిమాలకి అక్కడ మంచి మార్కెట్ వుంది. అక్కడ ఆయన సినిమాలు భారీ వసూళ్లను సాధిస్తూ వుంటాయి. ఇదే విషయాన్ని 'జెంటిల్ మన్' సినిమా మరోమారు నిరూపించింది. శనివారం నాటికి యుఎస్ లో ఈ సినిమా 415కె డాలర్లు రాబట్టింది. అక్కడ ఈ సినిమాకి లభిస్తోన్న ఆదరణ చూస్తుంటే, నాని ఖాతాలోకి మరో 1 మిలియన్ డాలర్ మూవీ చేరిపోయినట్టేనని చెప్పుకుంటున్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సురభి .. నివేదా థామస్ కథానాయికలుగా అలరించారు. నాని పాత్రను చాలా భిన్నంగా ఇంద్రగంటి మోహనకృష్ణ డిజైన్ చేశాడు. డిఫరెంట్ షేడ్స్ గల ఈ పాత్రలో నాని పూర్తిగా ఇమిడిపోయాడు. వైవిధ్యభరితమైన కథ కథనాలు .. వాటిని ఆసక్తికరంగా ఆవిష్కరించిన తీరు ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను సాధించి పెడుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.211.117
Movie News (Latest)