ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నెగెటివ్ రోల్ పట్ల నాగ్ ఆసక్తి

Sun, Jun 19, 2016
నాగార్జున
నాగార్జున
కెరియర్ ఆరంభం నుంచి నాగార్జున కథానాయకుడిగా విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకూ అటు రొమాంటిక్ మూవీస్ లోను .. ఇటు భక్తి చిత్రాలలోను విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చిన నాగార్జున, తాజాగా నెగెటివ్ రోల్ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఇటీవల కాలంలో 'మనం' సినిమాతో హిట్ ఇచ్చి విక్రమ్ కుమార్, 'ఊపిరి' సినిమాతో హిట్ ఇచ్చి వంశీ పైడిపల్లి నాగార్జునకి బాగా దగ్గరయ్యారు.

అందువలన తనని నెగెటివ్ రోల్ లో చూపించే అవకాశాన్ని ముందుగా ఆయన వారికే అప్పగించారు. నెగెటివ్ రోల్ లో తాను అభిమానులను ఆకట్టుకునేలా కొత్తగా ఒక కథను సిద్ధం చేయమనీ, అది ఎంతో వైవిధ్యభరితంగా వుండాలని చెప్పారట. దాంతో ఈ దర్శకులిద్దరూ ప్రస్తుతం ఆ దిశగా దృష్టి పెట్టారనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ముందుగా ఆయనని ఎవరు మెప్పిస్తారో చూడాలి.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)