ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

భారీ చారిత్రక చిత్రంలో విజయ్!

Sun, Jun 19, 2016
విజయ్
విజయ్
ఆ మధ్య విజయ్ కథానాయకుడిగా 'పులి' అనే ఒక భారీ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బడ్జెట్ తో విజయ్ కథానాయకుడిగా మరో భారీ చిత్రం రూపొందే అవకాశం ఉన్నట్టుగా కోలీవుడ్లో వార్తలు షికారు చేస్తున్నాయి. శ్రీ తేనాండళ్ ఫిల్మ్స్ వారు తమ 100వ చిత్రాన్ని అత్యంత భారీగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట.

సుందర్.సి దర్శకత్వంలో, తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో సూర్య నటించనున్నట్టు కొన్నిరోజుల క్రితం వార్తలు వచ్చాయి. అయితే తాను ఈ సినిమా చేయనున్నాననే విషయంలో నిజం లేదని సూర్య ఒక సందర్భంలో చెప్పాడు. ఇక తాజాగా ఈ సినిమాలో విజయ్ నటించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంతవరకనేది తెలియదుగానీ, కోలీవుడ్లో ఇప్పుడిది హాట్ టాపిక్ గా మారిపోయింది.
X

Feedback Form

Your IP address: 54.158.167.137
Movie News (Latest)