ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'జనతా గ్యారేజ్' ఆడియో డేట్ మారనుందా?

Sun, Jun 19, 2016
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్
'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ నెల చివరితో ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తికానుంది. దాంతో ఆడియో వేడుకకి అవసరమైన ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలను జూలై 14న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన, జూలై 25న ఆడియోను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.

ఈ విషయంలో స్పష్టత వచ్చాక ప్రకటన చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదలను ఖరారు చేసుకున్నారు. కథా పరంగా ఈ సినిమాలో అనూహ్యమైన మలుపులు వున్నాయని చెబుతున్నారు. ప్రతి మలుపు ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుందని అంటున్నారు. ఎన్టీఆర్ ఈ తరహా పాత్ర చేయడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.157.225.99
Movie News (Latest)