ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ బాటలో చరణ్

Sat, Jun 18, 2016
చరణ్
చరణ్
చరణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధ్రువ' సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన లుక్ పరంగా .. ఫిజిక్ పరంగా మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అంతేకాదు జపాన్ కి చెందిన 'ఐకిడో' అనే మార్షల్ ఆర్ట్ ను సైతం నేర్చుకుంటున్నాడు.

ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ట్రైనర్ ద్వారా ఆయన ఈ శిక్షణ పొందుతున్నాడని అంటున్నారు. హఠాత్తుగా శత్రువులు చుట్టుముట్టినప్పుడు సమర్థవంతంగా వాళ్లని ఎదుర్కోవడానికి 'ఐకిడో' ఎంతగానో ఉపయోగపడుతుందట. ఈ మార్షల్ ఆర్ట్ కి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో ఉండటంతో, చరణ్ తర్ఫీదు పొందుతున్నాడని చెబుతున్నారు. గతంలో 'జానీ' సినిమా కోసం పవన్ కల్యాణ్ ఈ మార్షల్ ఆర్ట్ ను నేర్చుకున్నాడు. ఇప్పుడు 'ధ్రువ' సినిమా కోసం చరణ్ శిక్షణ తీసుకుంటూ, బాబాయ్ బాటలోనే నడుస్తున్నాడన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.158.173.184
Movie News (Latest)